BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 29 May 2026, 03:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా..

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 03:01 PM
250 వీక్షణలు

కలియుగ అంతం పై బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..!

శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంది.

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలో ఉన్న 1228 నాటి పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి పాదాల పీఠం భాగం నుంచి ఎర్రటి వర్ణంలో ఉన్న ద్రవం వెలువడుతున్నట్లు స్థానికులు గుర్తించారు.

ఈ విషయం గ్రామంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సాధారణంగా శిలా విగ్రహాల నుంచి ఇలాంటి ద్రవాలు రావడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తుల్లో భక్తి భావంతో పాటు ఆందోళన కూడా నెలకొంది.

ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కలియుగాంతానికి ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెట్టడం, రక్తం కార్చడం వంటి సంకేతాలు కనిపిస్తాయని పేర్కొన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనను అదే కాలజ్ఞానంతో ముడిపెట్టి కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఘటనపై అధికారికంగా ఆలయ నిర్వాహకులు లేదా పురావస్తు, శాస్త్ర నిపుణులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్రవం ఎలా వస్తోంది? దాని స్వరూపం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.