BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 23 April 2026, 10:59 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 10:59 AM
177 వీక్షణలు

మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి: భయాందోళనలో విద్యార్థులు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడికి తెగబడటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి హాస్టల్ నుంచి నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చిన విద్యార్థుల ముందు ఇద్దరు యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ ప్రమాదకరంగా కట్ కొట్టగా, దీనిని ప్రశ్నించినందుకు సదరు యువకులు "ఇది మా ఊరు రోడ్డు.. మీరు ఇక్కడ నడవవద్దు" అంటూ విద్యార్థులపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో ఒక విద్యార్థికి గాయాలవ్వగా, బాధితులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో భయాందోళనలకు గురవుతున్న విద్యార్థులు క్యాంపస్ బయటకు రావాలంటేనే వణుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, కళాశాల యాజమాన్యం స్థానికులతో మాట్లాడుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. దీనిపై స్థానిక ఎస్సై స్పందిస్తూ, ఇప్పటివరకు తమకు రాతపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు