BREAKING
మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
Date of Publish : 19 April 2026, 12:00 pm
Posted by : RAMU JAJU

మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు...

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 12:00 PM
128 వీక్షణలు

మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు...

డొంకేశ్వర్: ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిసిందే. ఈ క్రమంలో  రేషన్‌ బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి రేషన్ బియ్యం తీసుకోవడానికి క్యూలో నిలబడ్డారు. బయోమెట్రిక్ సర్వర్ సరిగ్గా రావడం లేదని.. అందువల్ల చాలా సమయం పడుతుందని రేషన్ షాప్ వద్ద ఉన్న వినియోగదారులు తెలియజేశారు.మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తున్ననందున ఒక్కొక్కరికి కనీసం 10 నిమిషాల సమయం పడుతున్నదని డీలర్లు చెబుతున్నారు. అందుకే షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు ఈ-పాస్‌ మిషన్లలో సాంకేతిక సమస్యల కారణంగా మరింత ఆలస్యమవుతున్నది. ఓవైపు గంటల తరబడి క్యూలో ఉండడం మరోవైపు బయట ఎండలు మండిపోతుండడంతో తట్టుకోలేక సొమ్మసిల్లుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం పంపిణీ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు...