BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 08:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రమాదాల నివారణకు కలిదిండి పోలీసుల వినూత్న చర్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:06 PM
50 వీక్షణలు

ప్రమాదాల నివారణకు కలిదిండి పోలీసుల వినూత్న చర్య ప్రమాదకర ప్రాంతాల్లో రెట్రో రిఫ్లెక్టివ్ హెచ్చరిక డ్రమ్ముల ఏర్పాటు

ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలిదిండి పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు, కైకలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ పర్యవేక్షణలో, కలిదిండి ఎస్‌ఐ ఎస్.ఎస్.ఎస్. పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రోడ్డు భద్రత కార్యక్రమాన్ని అమలు చేశారు.

కలిదిండి మండలం మద్వానిగూడెం నుంచి కోరుకొల్లు వరకు ఉన్న రాష్ట్ర రహదారి–19పై గతంలో తరచూ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు, ప్రమాదకర మలుపులు, అధిక వేగంతో వాహనాలు ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ సుమారు 65 ప్లాస్టిక్ డ్రమ్ములకు రెట్రో రిఫ్లెక్టివ్ టేపులు అమర్చి హెచ్చరిక సూచికలుగా ఏర్పాటు చేశారు.

పగలు, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రూపొందించిన ఈ డ్రమ్ములు వాహనదారులకు ముందస్తు హెచ్చరికగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో దృశ్యమానత పెరగడంతో వాహనదారులు వేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. "వేగం తగ్గించండి... ప్రాణాలను కాపాడండి" అనే సందేశంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.