BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 17 May 2026, 08:10 am
Posted by : కూనురు మధు

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 May, 2026 - 08:10 AM
137 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నియామకం పట్ల హర్షం : కూనూరు సంజయ్ దాస్ గౌడ్ NTODAY NEWS చిట్యాల 

రాష్ట్ర కమిటీతో పాటు ఉమ్మడి జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీర కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని నియమించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కూనూరు సంజయ్ దాసు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలు, అలాగే ఎన్నో కష్టనష్టాలు భరించి ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.

అయితే రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్థానిక స్థాయిలో కమిటీలు ఉంటే నిజమైన ఉద్యమకారులను గుర్తించడం సులభమవుతుందని, అర్హులైన వారందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం, గుర్తింపు, సంక్షేమం అందుతుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వ పరంగా సరైన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున శ్రీ కూనూరు సంజయ్ దాసు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.