ఎస్‌ఐఆర్ ఫారం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ
/
హైదరాబాద్
ఎస్‌ఐఆర్ ఫారం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎస్‌ఐఆర్ ఫారంలో తన వివరాలను నమోదు చేసి బీఎల్‌వోలకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాబితాలో పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే ఫారం నింపాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించి నమోదు ప్రక్రియ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.