BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ
30 Dec, 2025 - 10:22 AM
171 వీక్షణలు

పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు

NTODAY NEWS: రామగుండం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు: అంబర్ కిషోర్ ఝా తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు ఆనందంగా వేడుకలు జరుపుకోండి… కానీ చట్టానికి లోబడి మాత్రమే. డిసెంబర్ 31 రాత్రి 10.00 గంటల నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, బైండ్‌ఓవర్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్య సూచనలు: 📌 డిసెంబర్ 31 రాత్రి స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి ప్రమాదాల నివారణ, అక్రమ సిట్టింగులు, బహిరంగ మద్యం సేవనం, మహిళలపై వేధింపులు వంటి ఘటనలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణతో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహిస్తారు. 📌 నూతన సంవత్సర వేడుకలను అర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలి. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. వేడుకల ప్రాంగణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సెక్యూరిటీ సిబ్బంది నియామకం తప్పనిసరి. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. 📌 ఆర్కెస్ట్రా, డీజేలు, మైకులు, బాణసంచా పూర్తిగా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. 📌 మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు ప్రభుత్వం అనుమతించిన సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. 📌 డిసెంబర్ 31 రాత్రి 10.00 గంటల నుంచి నిర్వహించే స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం సేవించి నిర్లక్ష్యంగా లేదా వేగంగా వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకొని వాహనాలు సీజ్ చేయడం, జరిమానాలు విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, బైండ్‌ఓవర్ వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. 📌 ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 📌 యువతపై కేసులు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల కోసం వీసాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మద్యం సేవనానికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. 📌 వేడుకల సమయంలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికెట్లు, మఫ్టీ టీమ్స్, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు వంటి ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. 📌 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజలు, యువత శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సమేతంగా తమ ఇళ్లలో సంతోషంగా, చట్టబద్ధంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. Follow us on Website Facebook Instagram YouTube