BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 June 2026, 10:27 pm
Posted by : కూనురు మధు

ప్రభుత్వ విప్ వేముల వీరేశంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Jun, 2026 - 10:27 PM
350 వీక్షణలు

తెలంగాణ ఉద్యమకారుల, కళాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, ప్రభుత్వ విప్ పదవిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన నోరు అదుపులో పెట్టుకోవాలని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు, పలువురు ఉద్యమ నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం  సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ లింగయ్య తీరుపై నిప్పులు చెరిగారు. ఉద్యమకారులను హింసించిన చరిత్ర నీది , తెలంగాణ ఉద్యమ సమయంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఎందరో ఉద్యమకారులపై లాఠీచార్జీలు చేయించి, అక్రమ కేసులు బనాయించి, రాత్రికి రాత్రి అరెస్టులు చేయించిన చరిత్ర లింగయ్యదేనని వారు ఆరోపించారు. సూర్యాపేట జేఏసీ టెంట్ కూల్చివేత సమయంలో పోలీసులు లాఠీచార్జీ చేయడంతో సొమ్మసిల్లి పడిపోయిన తమను ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదుకుని ఆసుపత్రిలో చేర్పించారని గుర్తుచేశారు. నార్కట్‌పల్లి కామినేని వద్ద, కట్టంగూర్, చిట్యాల పరిధిలో ఉద్యమకారులను పోలీసుల హింస నుండి కాపాడింది వేముల వీరేశమేనని స్పష్టం చేశారు. నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన లింగయ్యకు, నేడు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కూర్చొని ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ​ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ, నిబద్ధతతో పనిచేస్తున్నందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వేముల వీరేశానికి హుందాగా ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారని వారు పేర్కొన్నారు. నకిరేకల్ గడ్డపై ప్రజల చేత ఛీత్కరించుకొని, వీరేశం చేతిలో చిత్తుగా ఓడిపోయినా లింగయ్యకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. స్వప్రయోజనాల కోసం తనను రాజకీయంగా ఎదిగించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌నే నాడు మోసం చేసిన చరిత్ర లింగయ్యదని విమర్శించారు. ​తెలంగాణ ఉద్యమ గొంతుక వేముల పుష్పక్క, ఉద్యమకారులు, మహిళల పట్ల లింగయ్య మాట్లాడిన పద్ధతి ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యమకారులపై, కళాకారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు లింగయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమకారుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.​ ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారులు కాటం వెంకన్న, కోనేటి యాదగిరి, ఏనుగు నరసింహారెడ్డి, గోపగోని నరసింహ, బెల్లి సత్తయ్య, బట్టు ఐలేష్, కొండకింది వెంకట్ రెడ్డి, గోపగోని లింగస్వామి, బుస్సు శ్రీనివాస్, బైకాని నాగరాజు, కూరాకుల సురేష్, దామనూరి అశోక్, కొసనం అశోక్, జవ్వాజి శేఖర్ తదితరులు ఉన్నారు.