BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:48 PM
56 వీక్షణలు

ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన ఆర్డీవో ఏ. కుమార్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆర్డీవో ఏ. కుమార్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా వ్యక్తిగత, భూ సంబంధిత, విద్యా సమస్యలకు సంబంధించిన పలు వినతులు అందాయి. ప్రతి అర్జీని పరిశీలించిన ఆర్డీవో సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన యాదాల రామయ్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి, తమ సొంత స్థలంలో ప్రహరీ గోడ నిర్మించుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గోడ లేకపోవడంతో మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఆర్డీవో, కంభంపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి, చట్టబద్ధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రహరీ గోడ నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే తిరువూరు పట్టణానికి చెందిన షెడ్యూలు తెగల విద్యార్థిని పొద్దుటూరి భాను, ఫీజు బకాయిల పేరుతో పాఠశాల యాజమాన్యం ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీ.సీ.) ఇవ్వకుండా, మరోసారి ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తోందని ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా ఆర్డీవో వెంటనే స్పందించి, సంబంధిత పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థిని భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

సమస్యలపై ఆర్డీవో వెంటనే స్పందించి న్యాయం చేయడంతో అర్జీదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ వినతులకు సత్వర పరిష్కారం చూపిన ఆర్డీవో ఏ. కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యాంశాలు:

తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ.

ప్రజల నుంచి వ్యక్తిగత, భూ, విద్యా సమస్యలపై వినతుల స్వీకరణ.

కంభంపాడు గ్రామంలో ప్రహరీ గోడ నిర్మాణానికి ఆటంకాలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు.

విద్యార్థినికి టీ.సీ. ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి ఆర్డీవో ఆదేశం.

సమస్యలను వెంటనే పరిష్కరించడంతో అర్జీదారుల హర్షం.