BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2025, 10:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పోలీసులకు బహిరంగ సమాపణ చెప్పాలి...

తెలంగాణ
09 Apr, 2025 - 10:32 AM
290 వీక్షణలు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ సమాపణ చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు,, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా, రామగిరి మండలం, పాపిరెడ్డి పల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి నిలబెడతానని, రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసులు రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తూ, రూల్ ఆఫ్ లా ను పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ది కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను అవమానించడమేనన్నారు. పోలీసులను బట్టలూడదీస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేయడం, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు. మాజీ ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదన్నారు. ఇకనుండి అయినా మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకరబెదిరింపు వ్యాఖ్యలు మానుకోని పోలీసులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగం ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి శేషయ్య స్టేట్ మెంబర్ పి భవాని అనంతపురం ప్రెసిడెంట్ టి పెద్దయ్య విజయవాడ సిటీ ప్రెసిడెంట్ సోమయ్య, అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు... Follow us on Website Facebook Instagram YouTube